బిగ్ బ్రేకింగ్ : పవన్ తో మరొక సినిమా చేయనున్న హరీష్…. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్..!!

-

రెండేళ్ల క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయ్యారు. అనంతరం తన జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్, ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన పింక్ సినిమా అధికారిక తెలుగు రీమేక్ లో ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది.

ఇక దీని తరువాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న పవన్, దానిని వచ్చే పొంగల్ సమయంలో రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఇకపోతే కాసేపటి క్రితం ఒక భారీ అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ కి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక అధికారిక ప్రకటనను వెలువరించడం జరిగింది. అంతకముందు దాదాపుగా పదేళ్ల పాటు సరైన సక్సెస్ లేని పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ సినిమాతో ఎంతటి విజయాన్ని అందుకున్నారో అందరికీ తెలిసిందే.

 

ఇక ప్రస్తుతం మళ్ళి ఇన్నేళ్ల తరువాత అదే కాంబో సెట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ విపరీతమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా హరీష్, పవన్ తో ఒక సినిమా చేస్తారని పలు వార్తలు ప్రచారం అయినప్పటికీ, అవి ఏవిధంగానూ కార్యరూపం దాల్చలేదు. ఇకపోతే ప్రస్తుతం బన్నీ, సుకుమార్ ల కాంబోలో సినిమాతో పాటు, పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమాని కూడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుండి రాబోతున్న ఈ ప్రాజక్ట్ పై విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే…..!!

Read more RELATED
Recommended to you

Latest news