అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వినతులు అన్నింటినీ పరిష్కరించడమే అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సమస్యలకు కారణం అయినా అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ కారణంగా ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని వెల్లడించారు.
కొన్ని రికార్డులను కూడా తారు మారు చేశారని ఆరోపించారు చంద్రబాబు. రీ సర్వే అస్తవ్యస్థంగా జరగడం వల్లనే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతీ జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారు. మదనపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అన్నారు. వ్యవస్థలను 100 రోజుల్లో గాడిన పెడతామని తెలిపారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ శాఖలను ప్రక్షాళన చేస్తాం. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సమస్యలను విభాగాల వారిగా విభజించి పరిష్కరిస్తామని తెలిపారు.