నీ కోరికలు నిన్ను మోసం చేయద్దని తెలిపే అద్భుతమైన కథ..

Join Our Community
follow manalokam on social media

ఒకానొక ఊరిలో రాజు దగ్గర తెలివైన మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి జంతువులతో మాట్లాడడం తెలిసే విద్య ఉండేది. ఆ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఒకానొక రోజు మంత్రిగారు కొందరు అనుచరులని తీసుకుని నది తీరానికి వెళ్ళారు. అక్కడ చేపలు పడుతున్నవాళ్ళు కనిపించారు. నదిలో చేపలు పడుతున్న సమయంలో ఒక చేప, తన భార్య చేప కోసం వెతుకుతూ ఉంది. ఆ భార్య చేప చాలా అందంగా ఉంది. దాని రంగు ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల మాదిరిగా చూడముచ్చటగా ఉంది.

ఆ భార్య చేప వల వైపు వెళ్తుండడం చూసి, భర్త చేప కూడా అక్కడికే వెళ్ళింది. వలని లాగుతున్నప్పుడు భార్య చేప వెంటనే తప్పించుకుంది. కానీ భర్త చేప అంత త్వరగా తప్పించుకోలేక వలలో చిక్కుకుంది. భార్య చేప అదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. భర్త చేప మాత్రం నా భార్యా, నా భార్యా అంటూ కొట్టుకుంటూనే ఉంది. వలలో పడ్డ చేప బయటకు రాగానే అక్కడ తిరుగుతున్న మంత్రి గారికి కనిపించింది. దాని కష్టం అర్థం చేసుకున్న మంత్రిగారు దాన్ని విడిపించాలని డిసైడ్ అయ్యాడు.

అప్పుడు ఆ చేపలు పట్టే వ్యక్తి వద్దకి వెళ్ళి, మేము రోజూ నదీతీరానికి వస్తున్నాం. ఒక్కసారి కూడా చేపలు తీసుకోండని ఇవ్వలేదు. ఈ సారి మాకు కావాల్సిన చేప ఇస్తావా అని అడగ్గానే, ఆ చేపని మంత్రిగారికి ఇచ్చేసాడు. ఆ చేపని చేతిలో పట్టుకున్న మంత్రిగారు ఇప్పటికైనా తెలుసుకో. నీ కోరికలు నిన్నెలా మోసం చేస్తాయో! అనవసరంగా ఊహించేసుకుని, ఇతరుల కోసం బాధపడుతున్నావు. అదెంతా బాధకరమో, ఎలాంటి ప్రమాదాన్ని తీసుకువస్తాయో ఇప్పటికైనా తెలుసుకో అని నదిలోకి పంపేసాడు.

మీ జీవితంలో మీ కోరికలు మిమ్మల్ని ఆనందింపజేసేలా ఉండాలే కానీ, మిమ్మల్ని మోసం చేసేలా ఉండకూడదు. డేర్ టు డూ మోటివేషన్ ఆధారంగా.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...