టీ కాంగ్రెస్ కు మరో షాక్.. బీజేపీలోకి కీలక నేత !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ లో కీలక నేతగా భావించే కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మేడ్చల్ డిసిసి అధ్యక్షుడిగా కూన శ్రీ శైలం గౌడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు గాను కూన శ్రీశైలం గౌడ్ ఢిల్లీకి బయలు దేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈయన వైయస్ హయాంలో కుత్బుల్లాపూర్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

అప్పటి నుంచి ఈయన కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉంటున్నారు.. ఇక ఈయన కాంగ్రెస్ పార్టీకి పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో సమావేశమైన అనంతరం ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సైతం ఈయన సోదరుడు కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు..అయితే ఈయన ఇంత సడన్ గా ఎందుకు పార్టీ మారుతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

TOP STORIES

ఇక నుండి 24×7 కరోనా వాక్సిన్…!

ఇప్పుడు వ్యాక్సిన్ కనుక వేయించుకోవాలి అంటే సరిగ్గా ఇదే సమయానికి వేయించుకోవాలని ఏమీ లేదు. హాస్పిటల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునే వాళ్లు సమయాన్నిబట్టి షెడ్యూల్ ని...