హోలీ వేడుకల ముసుగులో గంజాయి..!

-

హోలీ వేడుకల ముసుగులో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే పక్క సమాచారంతో హోలీ ఈవెంట్స్ లో STF దాడులు నిర్వహించింది. గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్, గంజాయి బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎస్టిఎఫ్ పోలీసులు. లోయర్ దూల్పేట్ లోని మల్చిపురా హోలీ ఈవెంట్స్ లో కుల్ఫీ ఐస్ క్రీమ్ లో గంజాయి, బర్ఫీ స్వీట్ లో గంజాయి, సిల్వర్ కోటెడ్ బాల్స్ లో గంజాయి పెట్టి అమ్మకాలు జరుపుతున్నారు నిందితులు.

అయితే విషయం తెలుసుకొని దాడి చేసారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టిఎఫ్ పోలీసులు. ఇక ఈ గంజాయి కుల్ఫీ ఐస్ క్రీమ్స్ తయారు చేసిన సత్యనారాయణ సింగ్ పై కేసు నమోదు చేసారు. అలాగే బాదం మిల్క్, ఐస్ క్రీమ్, స్వీట్స్ గంజాయి కలిపి అమ్మిన నిర్వాహకుల పై కేసులు నమోదు చేసారు పోలీసులు. అలాగే ప్రజలు హోలీ పండగను రంగులతో జరుపుకోవాలి కానీ.. ఇలా కాదు అని సూచిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news