మీ భర్తని ఇలా ఇంప్రెస్ చేసి.. మీ బంధాన్ని ధృడంగా మార్చుకోండి..!

-

భార్య భర్త కలసి ఆనందంగా ఉండాలని అనుకుంటారు. చాలామంది భార్య భర్తలు రోజుల్లో గొడవ పడడం మాటా మాట రావడం ఎంతటికైనా వెళ్లిపోవడం విడిపోవడం మంచిదని అనుకోవడం… ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తున్నాము. కానీ నిజానికి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవించుకుంటూ ఉంటే కచ్చితంగా వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది. భర్తని భార్య ఇంప్రెస్ చేసి భర్తని ఈ విధంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. అనుక్షణం భర్తని సర్ప్రైజ్ చేస్తూ ఉంటే భర్త భార్య మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది.

ఇద్దరు కలిసి స్పెషల్ గా ఏదైనా ప్లాన్ చేసుకోవడం, కలిసి డిన్నర్ కి వెళ్లడం లేదంటే మంచి జ్ఞాపకాలని క్రియేట్ చేసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. భార్య కచ్చితంగా తన కోసం కొంత సమయాన్ని వెచ్చించాలి. భర్తని ఇంప్రెస్ చేసే విధంగా కొంచెం టైం తీసుకుని స్పెషల్ గా కనపడే విధంగా ఫోకస్ చేయవచ్చు ఇలా భర్తని ఇంప్రెస్ చేయొచ్చు అలానే రొటీన్ గా కాకుండా స్పెషల్ గా భర్తకు కనబడితే భర్త బాగా ఇంప్రెస్ అవుతారు. మిమ్మల్ని బాగా ఇష్టపడతారు.

మీ భర్తకి మంచి మసాజ్ చేస్తే కూడా రొమాంటిక్ ఫీల్ కలుగుతుంది. మీలో ఉండే రొమాంటిక్ సైడ్ ని బయటకి తీయండి. భర్త రాగానే మంచి హాగ్ లేదంటే ఒక ముద్దు ఇచ్చి మీ వైపుకి తిప్పుకోండి. కలిసి షవర్ తీసుకోండి. మీ భర్తతో కాస్త ప్రేమగా మాట్లాడుతూ దగ్గరకి తీసుకోండి మీకు ఏమి ఇష్టమో బయటకు ఎక్స్ప్రెస్ చేయండి. కలిసిన నవ్వుతూ సమయాన్ని గడపండి ఇలా కొంచెం కొత్తగా కొంచెం స్పెషల్ గా మీరు మీ భర్తని ఇంప్రెస్ చేసినట్లయితే కచ్చితంగా మీ బంధం బాగుంటుంది. చాలా మంది భర్తలు ఇంట్రెస్ట్ లేనట్లు కనపడుతుంటారు కానీ కొంచెం భార్య ఒక స్టెప్ తీసుకున్నట్లయితే భార్య భర్త మధ్య రొమాన్స్ ని పెంచవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news