పిల్లలతో తల్లిదండ్రులు అస్సలు ఇలా చెప్పకూడదు..!

-

చాలా మంది తల్లిదండ్రులు ఇలాంటి పొరపాట్లనే చేస్తూ ఉంటారు. నిజానికి తల్లిదండ్రులే పొరపాట్లు చేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు..? ఎప్పుడూ కూడా పిల్లల్ని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు చూసుకోవాలి. అలానే పిల్లలు మంచి బాటలో నడిచేటట్టు చూసుకోవాలి. అయితే తల్లిదండ్రులు అసలు ఈ విషయాలని పిల్లలతో చెప్పకూడదు ఇలా కనుక పిల్లలకి చెప్పారంటే పిల్లలు చక్కటి బాట పట్టలేరు. పైగా వారికి సమస్యలు కలుగుతూ ఉంటాయి. మరి తల్లిదండ్రులు పిల్లలతో ఎలాంటివి చెప్పకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏడవడానికి కారణం లేదు:

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏడిస్తే కారణాలు లేకుండా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటారు. తల్లిదండ్రులకి అది పాయింట్ కాకపోవచ్చు కానీ పిల్లలు దానికి బాధపడి ఉండొచ్చు.

భోజనం చేసే వరకు ఐస్క్రీమ్ తినొద్దు:

ఇలా చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కానీ పిల్లలకి ఆహారం మీద ఇష్టం ఉండకుండా ఐస్ క్రీమ్ కోసం ఆహారాన్ని తినేస్తుంటారు దీనివలన ఆహారం మీద ఆయిష్టం కలుగుతుంది. కనుక ఇలా అసలు చేయకండి.

ఇలా అవ్వలేదమ్మా:

ఏదైనా తప్పు చేసిన లేదంటే పిల్లలు బాధపడుతున్నా అలా జరగలేదు కదా అని అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలకి అబద్దాలు చెప్పకూడదు.

మైండ్ యువర్ వర్డ్స్:

ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి మైండ్ యువర్ వర్డ్స్ అని చెప్పకూడదు.

వాళ్లలా ఎందుకు ఉండడం లేదు:

ఎవరైనా పిల్లలని చూపించి ఎందుకు నువ్వు వారిలా చదువుకోవడం లేదు వారిలా ఉండడం లేదు అని తల్లిదండ్రులు అస్సలు పిల్లలకి చెప్పకూడదు. ఇది కూడా పిల్లల్ని బాగా ఇబ్బందికి గురిచేస్తుంది.

ఎప్పటికీ నిన్ను క్షమించను:

పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎక్కువగా ఎప్పటికీ నిన్ను క్షమించను అని అంటూ ఉంటారు అది కూడా నిజంగా తప్పు. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకి ఇలా చెప్పకండి.

Read more RELATED
Recommended to you

Latest news