మనం చేసే పని వల్ల మనకి ఆనందం మాత్రమే కలగాలి. ఇష్టపడుతూ జాబ్ చేయడం వల్ల ఫ్రస్ట్రేషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం లాంటివి ఉండవు. అలానే ఎప్పుడూ కూడా విసుగు రాదు. మీ జాబ్ వల్ల మీకు ఆనందం కలగటం లేదని అనుకుంటున్నారా..? జాబ్ వల్ల సాటిస్ఫాక్షన్ లేదా..? అయితే ఇవి మీ కోసం…
పాజిటివ్ గా ఆలోచించండి:
ఎప్పుడూ కూడా మీరు మీ పట్ల మీ జాబ్ పట్ల పాజిటివ్ గా ఆలోచించండి. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా నెగటివ్ గా తీసుకోకండి. ఒకవేళ మీరు అనుకున్న జాబ్ మీరు చేయకపోయినా ఇప్పుడు మీరు చేసే జాబ్ మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి… ఇలా ఎన్నో వాటిని నేర్పిస్తుంది.
మంచి మూడ్ తో రోజును ప్రారంభించండి:
ఫ్రెష్ గా మీరు మీ పని ప్రారంభించండి. మీ పని మొదలు పెట్టేటప్పుడు మీకు నచ్చిన పాట వినడం లేదంటే చల్లగాలిలో కాసేపు ఉండడం లేదా మీకు నచ్చిన ఒక కప్పు కాఫీ లేదా టీ ని తీసుకోవడం లాంటివి చేయడం వల్ల మీరు మంచి మూడ్ తో ఉండగలరు. దీనితో మీరు పనిని ప్రారంభిస్తే హ్యాపీగా ఉంటుంది.
నెగిటివ్ గా ఉండద్దు:
గాసిప్స్ లాంటివి వినకండి. మీ తోటి ఉద్యోగస్తుల తో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. వీలైతే సహాయం చేయండి. ఇలా నెగిటివ్ మాటలకి దూరంగా ఉండండి. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉండండి.
మార్పు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండండి:
మంచి విషయాలు మాట్లాడుకునే గ్రూప్ దగ్గర మిమ్మల్ని మోటివేట్ చేసే వాళ్ల దగ్గర మీరు సమయాన్ని కేటాయించండి. అంతే కానీ ఎప్పుడు మీ ఆసక్తిని తగ్గించే వాళ్ళ దగ్గర మీ సమయాన్ని వెచ్చించకండి.
మీ వర్క్ ప్లేస్ ని అందంగా మార్చుకోండి:
మంచి లైటింగ్ తో కంఫర్టబుల్ రూమ్ టెంపరేచర్ లో ఉండేటట్లు చూసుకోండి. ఒత్తిడికి గురి చేసే వర్క్ ప్లేస్ కాకుండా మిమ్మల్ని కంఫర్ట్ చేసే వర్క్ ప్లేస్ లో మీరు వర్క్ చెయ్యండి. దీని వల్ల మీరు హ్యాపీగా వర్క్ చేయగలరు.