మీరు అనుకున్న గోల్స్ ని మీరు నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం..!

-

సాధారణంగా ప్రతి ఒక్కరికి జీవితం లో గోల్స్ అనేవి ఉంటాయి. ఇలా ఉండాలి నేను అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైనా ఓటమి కనుక ఎదురైతే అప్పుడు మనలో మనమే కుమిలిపోతే వాటిని మనం సాధించలేము అన్న నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ అలా చేయడం మంచిది కాదు. మీరు అనుకున్న గోల్స్ ని మీరు రీచ్ అవ్వాలి అంటే ఇవి చాలా ముఖ్యం. మరి ఆలస్యం ఎందుకు వీటి మీద ఒక లుక్కేయండి.

పెద్ద గోల్స్ ని ఎంచుకోండి:

మీరు అనుకున్నది చాలా పెద్దగా ఉండేలా ఎంచుకుని వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని మీ పనులు పూర్తి చేయండి. ఇలా మీరు పెద్ద వాటి కోసం చిన్న చిన్న విభాగాలుగా కట్ చేసుకుని మీరు కనుక కొనసాగిస్తే తప్పకుండా మీరు వాటిని రీచ్ అవ్వగలరు.

మీ గోల్స్ ని ఇతరులు నిర్ణయించ కూడదు:

ఎప్పుడూ కూడా మీ గోల్స్ ని మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీ సామర్థ్యాలు, మీ ఇష్టాలు మీకు మాత్రమే తెలుస్తుంది. ఇతరులకు పూర్తిగా తెలియదు. కాబట్టి ఎప్పుడూ మీ గోల్స్ ని మీరే నిర్ణయించుకోండి. దాని కోసం మీరే పని చేయండి.

క్లియర్ గా ఉండండి :

ప్రతి ఒక్క విషయం మీకు తెలిసి ఉండాలి. ప్రతి దానిపై మీకు అవగాహన ఉండాలి. అలానే మీరు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనే దానిపై మీకు క్లారిటీ ఉండాలి.

మీ గోల్ మీకు ఎంత ముఖ్యమో తెలుసుకోండి:

మీరు అనుకున్నది సాధించాలంటే అది మీకు ఎంత అవసరమో దాని వల్ల మీకు ఏమి కలుగుతుంది… అనే వాటి పై కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఇలా మీరు అనుకున్నది సాధించడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news