హ్యాపీగా ఉన్న జంటలు కూడా ఒకరినొకరు మోసం చేసుకోవడానికి కారణాలు..

-

ఇద్దరు భాగస్వాముల మధ్య గొడవలు వచ్చేది నమ్మకం కోల్పోయినపుడే. ఒకరి మీద మరొకరికి నమ్మకం లేక, ప్రతీదానికీ అనుమానపడుతూ, చివరికి ఏమీ చేయలేక ఆ రిలేషన్ లోంచి బయటపడతారు. ఐతే ఇక్కడ జంటలు పెద్దగా సంతోషంగా ఉండవు. కానీ మీకిది తెలుసా? చాలా మంది హ్యాపీగా ఉన్న జంటలు కూడా విడిపోతున్నాయి. లేదా ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి కారణాలేంటనేది ఇక్కడ చూద్దాం.

boyfriend or girlfriend starts cheating on you

నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు

తమ భాగస్వామి తనను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకున్నప్పుడు మోసం చేయాలన్న కోరిక ఎక్కువ కలుగుతుంది. తమంటే ఇంపార్టెన్స్ ఇచ్చే వారి కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

వేరు వేరు కోరికలు

శృంగార పంగా ఇద్దరు భాగస్వాములకి వివిధ రకాల కోరికలు ఉన్నప్పుడు, అవతలి వారికి వాటిని చెప్పడంలో ఇబ్బంది పడుతుంటారు. చెప్తే ఏమనుకుంటారో అన్న భయం ఉంటుంది. అందుకే, వారి కోరికలను మ్యాచ్ అయ్యే వ్యక్తుల కోసం చూస్తుంటారు.

థ్రిల్

చాలామంది భాగస్వాములు తమ జీవితాల్లో సంతోషంగా ఉన్నప్పటికీ, జీవితంలో థ్రిల్ ఉండాలన్న ఉద్దేశ్యంతో తమ భాగస్వాములను మోసం చేయడానికి రెడీ అయిపోతారు.

స్పష్టత లేకపోవడం

తమ భాగస్వామ్యం మీద సరైన స్పష్టత లేకపోవడమనేది చాలా జంటల్లో జరుగుతుంది. అందుకే మోసం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తాము ఇతరులతో క్లోజ్ గా ఉంటూ తమ భాగస్వామిని మోసం చేస్తూ, దాని ద్వారా తమ వాల్యూ తెలియజేయాలని అనుకుంటారు.

నిర్ణయాలు తీసుకోలేకపోవడం

ఇద్దరు భాగస్వాములు ఒక లైఫ్ ని లీడ్ చేస్తున్న కొత్తలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అవతలి నుండి వచ్చే చాలా ఎమోషన్స్ ఎందుకోసం వస్తున్నాయనేది క్లారిటీ ఉండదు. అలాంటి టైమ్ లో సరిఅన నిర్ణయాలు తీసుకోకపోతే తమ భాగస్వామిని మోసం చేస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news