సెప్టెంబరు 25నుండి మళ్ళీ లాక్ డౌన్ అంటున్నారే.. నిజమెంత..?

మహమ్మారి విస్తరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అన్ లాక్ 4 తర్వాత దాదాపుగా అన్ని వ్యాపార సంస్థలు వాటి కార్యకలాపాలని మొదలు పెట్టాయి. ఢిల్లీలో జిమ్ సెంటర్లు కూడా ఓపెన్ అయ్యాయి. మెట్రో రైళ్ళు, బస్సులు, రైళ్ళు.. ఒక్కొక్కటిగా అన్నీ సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింతగా పెరుగుతున్నాయి. రోజు రోజుకీ రికార్డు లెవెల్లో కేసులు వస్తున్నాయి. రికవరీ రేటు పెరుగుతున్నా పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయి.

ఐతే అన్నీ తెరుచుకోవడం వల్లనే కేసులు పెరుగుతున్నాయన్న ఉద్దేశ్యంతో మళ్ళీ లాక్డౌన్ అన్న మాటలు వినిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గాలంటే లాక్డౌన్ తప్పని సరి అంటూ అంటున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 25వ తేదీ నుండి లాక్డౌన్ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ విపత్తు నిర్వహణ అదికార బృందం లాక్డౌన్ ని సిఫారుసు చేస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఐతే ఆ వార్తలని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కొట్టివేసింది. అదంతా ఫేక్ న్యూస్ అంటూ పక్కన పెట్టేసింది. లాక్డౌన్ మళ్ళీ పెట్టడం జరగదని స్పష్టం చేసింది.