ఏపీ కరోనా అప్డేట్ : 3342 కేసులు, 22 మరణాలు

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాస్త తగ్గిన కరోన కేసులు ఈ రోజు నిన్నటి కంటే కాస్త తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3342 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,04,026కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 22 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6566కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,469 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ap-corona
ap-corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7,65,991 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 74,919 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 75,02,933 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 131, చిత్తూరులో 404, తూర్పు గోదావరిలో 445, గుంటూరులో 378, కడపలో 203, కృష్ణాలో 344, కర్నూలులో 60, నెల్లూరులో 98, ప్రకాశంలో 266, శ్రీకాకుళంలో 112, విశాఖపట్నంలో 244, విజయనగరంలో 106, పశ్చిమ గోదావరిలో 551 కేసులు నమోదయ్యాయి.