దారుణం : పండగ పూట ఆవుని షూట్ చేసి చంపేశారు !

పండుగ పూట తెలంగాణాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వికారాబాద్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నోరు తెరిచి ఏమీ చెప్పలేని మూగ జీవం మీద తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన దుమారం రేపుతోంది. వివరాల్లోకి వెళితే కూడూరు మండలంలోని దామగుండం శివార్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఆవుపై తుపాకీతో కాల్పులు జరిపారు.

 

ఈ కాల్పుల్లో ఆవు అక్కడికక్కడే చనిపోయింది. ఆవుపై సుమారు మూడు రౌండ్లు తుపాకీతో కాల్పులు జరిపినట్లు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గుర్తించారు. అంతే కాదు ఘటనా స్థలంలో పలు బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలా పండుగ పూట హిందువులు దేవతగా పూజించే ఆవుని తుపాకులతో కాల్పులు జరపి చంపడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మూగ జీవాలపై అమానుష దాడులు చేసిన వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు..