ఆపిల్ ఫేస్ మాస్క్ వచ్చేస్తోంది..

-

ప్రస్తుతం ఇది కరోనా సమయం. అవసరముంటే తప్ప ఇంటి నుండి బయటకి వెళ్ళకపోవడం, బయటకి అడుగుపెడ్తే మాస్క్ పెట్టుకోవడం, తిరిగి ఇంటికి వస్తే శుభ్రంగా చేతులు, కాళ్ళు కడుక్కోవడం అలవాటైపోయింది. ముఖ్యంగా మాస్క్ మన జీవితంలో భాగమైపోయింది. కరోనా నుండి రక్షించేది అదే కాబట్టి దాన్నెప్పుడూ మరువకూడదు. ఐతే మాస్కుల్లో చాలా రకాలున్నాయి. మొదట్లో ఎన్ 95 మాస్కులు చాలా మంచివని చెప్పారు. ఆ తర్వాత ఆ మాస్కుకి ఉండే చిన్నపాటి రంధ్రంలో నుండి వచ్చే సూక్ష్మ క్రిముల ద్వారా కరోనా సోకే అవకాశం ఉందని అన్నారు. అందువల్ల బట్టతో చేసిన మాస్కులే మంచివని వినబడింది.

ఐతే ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ సంస్థ ఆపిల్. తమ ఉద్యోగస్తుల కోసం మాస్కులని తయారు చేసింది. ఆపిల్ ఫేస్ మాస్క్, ఆపిల్ క్లియర్ మాస్క్ అనే రెండు రకాల మాస్కులని తయారు చేసారు. ఆపిల్ ఫేస్ మాస్కులని ఇంట్లోనే ఇంజనీరింగ్ డిజైనర్లతో తయారు చేసారు. ఈ మాస్కులన్నింటినీ ఉద్యోగులకి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఐతే ప్రస్తుతానికి ఇవి కేవలం ఉద్యోగుల కోసమే మాస్కులని తయారు చేసింది. మరి మున్ముందు పెద్ద సంఖ్యలో మాస్కులు తయారు చేసి సాధారణ వినియోగదారులకి అందుబాటులో ఉంచుతుందో లేదో చూడాలి.

ఆపిల్ ఫేస్ మాస్కులో మూడు పొరలుంటాయి. దీనివల్ల చిన్న చిన్న నీటి తుంపర్ల నుండి రక్షణ కలుగుతుంది. ఐతే ఈ ఫేస్ మాస్కుని ఐదు సార్లు మాత్రమే వాడవచ్చట. వాడిన ప్రతీసారి మాస్కుని బాగా ఉతకాలని సూచిస్తున్నారు. ఇంకా ఆపిల్ క్లియర్ మాస్క్, పారదర్శకంగా ఉండి అది ధరించిన వారి మొహం కనబడేలా చేస్తుంది. ఈ మాస్కులు చెవిటి, మూగ వ్యక్తులు ఏం చెబుతున్నారో అవతలి వారికి అర్థం అవ్వడానికి డిజైన్ చేసారు. మొత్తానికి తమ సంస్థ ఉద్యోగుల గురించి ఆపిల్ మంచి నిర్ణయమే తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news