ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ ఉంటుంది. వాట్సప్ కొత్త ఫీచర్లు ఎంతో మందికి ఎన్నో రకాల ఉపయోగపడతాయి. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని తీసుకురావడానికి రెడీ అయింది. మెటా ఏఐ ఫీచర్ మొదలు నచ్చిన వాళ్ళతో చాట్ చేయడానికి వాళ్ళ కాంటాక్ట్ ని ఫస్ట్ యాడ్ చేసుకోవడం ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లని ఇప్పటికే వాట్సాప్ పలు ఫీచర్స్ ని తీసుకువచ్చింది. ఇప్పుడు సరికొత్త ఫీచర్ ని త్వరలోనే వాట్సాప్ తీసుకురావడానికి సిద్ధమైంది. మనకి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు వస్తున్న ఈ ఫ్యూచర్ వాట్సాప్ అడ్మిన్స్ కి ఇంకాస్త పవర్ ని తీసుకువస్తుంది. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ చాట్ లో ఎడ్మిన్ కి ఎక్కువ పవర్ రాబోతోంది. ఆండ్రాయిడ్ బీటా టెస్ట్ యూజర్లు ఈ ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నారు.
ఈ కొత్త ఫీచర్ గురించి క్లుప్తంగా చూసేద్దాం..
కొత్త ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్ అడ్మిన్లకి నిర్దిష్ట చాట్ విజిబిలిటీ యాక్సిస్ ఇవ్వబడుతుంది. అలాగే గ్రూప్ ఇన్వైట్ ద్వారా ఆహ్వానించబడిన సభ్యులు మాత్రమే నిర్దిష్ట చాట్లని చూడడానికి అవుతుంది. ప్రైవసీ ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కమ్యూనిటీ అడ్మిన్లు కొత్త గ్రూపులో ఎవరికీ విజిబిలిటీని ఇవ్వాలనుకుంటున్నారో వారిపై కూడా నియంత్రణ ఇవ్వబడుతుంది. ఇతరుల నుంచి హైడ్ చేయడానికి అవుతుంది. ఒకసారి ఈ ఫీచర్ ని ఉపయోగిస్తే దీనిని రిమూవ్ చేయడానికి అవ్వదు. ప్రైవసీని పొందడానికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ చేస్తుంది. కమ్యూనిటీ అడ్మిన్స్ హిడెన్ గ్రూప్ ని క్రియేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రహస్యమైన విషయాలని పంచుకోవడానికి కూడా అవుతుంది. ప్రైవేట్ చాట్ లాగ ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకోలేని దాని గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దాని గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.