బాలయ్య సేవా కార్యక్రమాలు స్టార్ట్… హిందూపురానికీ వెళ్తాయా?

-

ఒకపక్క కరోనా సమయం… వివిద కారణాలతో అందరికీ సాయం అవసరమైన పరిస్థితి. ప్రభుత్వాలు చేసేది చేస్తుంటే… రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ లు, సినీ ప్రముఖులు… ఇలా ఒక్కరేమిటి… సామాన్యుడి నుంచి సెలబ్రెటీ వరకూ ఎవరికి తోచిన విధంగా వారు పదిమందికి సాయపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీనటుడు, సవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తన సేవా కార్యక్రమాలు స్టార్ చేశారు. ఇప్పటికే సినిమా హీరోగా పరిశ్రమకు చెందిన వారికి తనవంతు సాయం చేశారని కథానాలు వస్తున్నాయి. అనంతరం హాస్పటల్ విషయంలో సేవ చేయాలన్ని నిర్ణయించారు బాలయ్య.

ఇందులో భాగంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు, హాస్పిటల్ విధులలో ఉన్న దివ్యాంగులకు బాలకృష్ణ నిత్యావసర వస్తువులను అందజేశారు. ఇదే క్రమంలో సంస్థ ఆవరణలో ఉన్న హాస్టల్‌ లో ఉంటున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి కూడా ప్రతి రోజూ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారట. దీంతో ఆ బాధ్యత కూడా పూర్తయ్యింది అంటున్నారు బాలయ్య అభిమానులు. కాకపోతే… ఉన్న మూడు పదవులకు సంబందించి, అటు సినిమా పరిశ్రమకి, ఇటు కేన్సర్ ఆసుపత్రికి ఎంతో కొంత న్యాయం చేయ ఆలోచించిన బాలయ్య హిందూపురంవైపు కూడా చూస్తే బాగుంటుందని అంటున్నారట.

అవును… మొదటి రెండు బాధ్యతలూ నిర్వర్తించిన బాలకృష్ణ… హిందూపురం ఎమ్మెల్యేగా… ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని.. ఈ కీలక సమయంలో వారిని కూడా ఎంతోకొంతగా ఆదుకోవాలని అంటున్నారు అభిమానులు. కాగా… అనంతపురం జిల్లాలోని కేసులో అధికమొత్తం హిందూపురంలో నమోదవడం తెలిసిన విషయమే!

Read more RELATED
Recommended to you

Latest news