లాక్‌డౌన్ ఎత్తేశాక రిజైన్ చేస్తా: ఐఏఎస్ అధికారిణి వివాదాస్ప‌ద ట్వీట్లు..!

-

క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన అధికారులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో యావ‌త్ దేశం వారిని కోవిడ్ వారియ‌ర్లుగా ప్ర‌శంసిస్తోంది. ప్రాణాల‌ను సైతం పణంగా పెట్టి వారు ప‌నిచేస్తున్నారు. దీంతో యావ‌త్ దేశం వారిని కొనియాడుతోంది. అయితే ఆ ఐఏఎస్ అధికారిణి మాత్రం ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితిలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. దీంతో ఇప్పుడామెపై అంద‌రూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

after lifting lock down i'll quit job says lady ias officer

హ‌ర్యానా క్యాడ‌ర్‌కు చెందిన 2014 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ రాణీ న‌గ‌ర్ (38) చండీగ‌ఢ్‌లోని కేంద్ర‌పాలిత ప్రాంత గెస్ట్ హౌస్‌లో ఉంటోంది. ఆమె త‌ల్లిదండ్రుల‌ది ఘ‌జియాబాద్‌. అయితే ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా తాను ఇక‌పై ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేయ‌బోన‌ని, లాక్‌డౌన్ అనంత‌రం త‌న ఉద్యోగానికి రాజీనామా ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేసింది. దీంతో నెటిజ‌న్లు ఆమెను తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో జ‌నాల‌కు సేవ చేయాల్సింది పోయి.. ఉద్యోగానికి రాజీనామా చేస్తాన‌న‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అయితే రాణీ న‌గ‌ర్ ఇప్ప‌టికే వేసిన ప‌లు కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 2018లో ఓ చీఫ్ సెక్ర‌ట‌రీ స్థాయి అధికారి త‌న‌తో డ‌బుల్ మీనింగ్ మాట‌లు మాట్లాడాడ‌ని ఆమె కోర్టులో కేసు వేసింది. అలాగే డిసెంబ‌ర్ 2017లో సిర్సా జిల్లాలో ఎస్‌డీఎంగా ప‌నిచేస్తున్న‌ప్పుడు త‌న‌కు ఓ అప‌రిచిత వ్య‌క్తి నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అలాగే ఏప్రిల్ 2018లో త‌న వాహ‌నంలో గ‌న్‌మెన్ నిద్రిస్తున్న వీడియోను ఆమె చిత్రీక‌రించి దాన్ని సోష‌ల్ మీడియా అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇక జూలై 2018లో ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్ త‌న ప‌ట్ల అసభ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని కేసు పెట్టింది. ఈ కేసుల‌న్నీ ప్ర‌స్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే రాణీ న‌గ‌ర్ చేసిన ట్వీట్ల‌కు ఇప్పుడామెను జ‌నాలు కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నారు. అంత‌మాత్రానికి ఐఏఎస్ కావ‌డం ఎందుక‌ని అడుగుతున్నారు. కాగా ఆమె ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news