ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అందరినీ భయపెడుతోంది. చాలా మంది దీని బారిన పడటం కూడా మనం చూశాం. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, ప్రాణాంతకమైన వ్యాధి అని నిపుణులు చెప్పడం జరిగింది. అయితే ఇది కరోనా వచ్చిన తర్వాత మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. కరోనా రాకుండా ఈ ఫంగస్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది.
కాబట్టి హై బ్లడ్ షుగర్ లెవెల్ ఉన్నవాళ్లు ఎలర్ట్ గా ఉండాలి. కరోనా రాక ముందు వచ్చే అవకాశం కూడా ఉందని డయాబెటిస్ ఉండే వాళ్లలో ఎక్కువ అవకాశం ఉంటుందని అంటున్నారు. డయాబెటిస్ చాలా సీరియస్ గా ఉన్నప్పుడు వాళ్లు బ్లాక్ ఫంగస్ బారిన పడుతూ ఉంటారు అని అన్నారు.
ఏదైనా ఇతర సమస్యలు అంటే నిమోనియా లాంటి వాటికి వలన కూడా బ్లాక్ ఫంగస్ వస్తుందని ఇప్పుడు కరోనా కారణంగా వస్తోందని అదేవిధంగా స్టెరాయిడ్స్ ఉపయోగించడం వల్ల వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు ఆరోగ్యంగా ఉండే వాళ్ళు ఇన్ఫెక్షన్ గురించి ఎటువంటి దిగులు చెందకర్లేదు.
ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వాళ్లకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది హర్యానాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఆదివారంనాడు 398 కి చేరింది గురుకులంలో 147 కేసులు నమోదయ్యాయి కేరళలో 4 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవగా మధ్యప్రదేశ్ జబల్పూర్ లో ఒక వైట్ ఫంగస్ కేసు రిపోర్ట్ అయింది