చాలా మందికి ఈ అనుమానం ఉంటుంది. వారంలో ఏ రోజున జుట్టు కత్తిరించడం మంచిదని. అయితే చాలా మంది శనివారం, ఆదివారం సెలవు ఉంటాయి కదా అని ఆరోజు జుట్టు కత్తిరించుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అందరూ ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే ఆదివారం అంటే సూర్యుని రోజు.
ఆ రోజున కనుక జుట్టు కత్తిరించుకుంటే మీయొక్క ధనాన్ని, తెలియని సూర్యుడు ధ్వంసం చేస్తాడు కాబట్టి మీరు ఆదివారం నాడు జుట్టు కత్తిరించుకోవడం మంచిది కాదని తెలుసుకోండి. అదే విధంగా సోమవారం నాడు కూడా జుట్టు కత్తిరించడం మంచిది కాదు. మానసిక సమస్యలు ఆ రోజు జుట్టుని కత్తిరించుకోవడం వల్ల వస్తాయని ముఖ్యంగా పిల్లలకు ఇది అస్సలు మంచిది కాదని గ్రహించండి.
మంగళవారం నాడు కూడా జుట్టు కత్తిరించుకోవడానికి మంచిది కాదు. జుట్టు కత్తిరించుకోవడానికి గోళ్ళు కత్తిరించుకోవడానికి బుధవారం నాడు మంచిది. అలా చేయడం వల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండకుండా మీ యొక్క ధనం పెరుగుతుంది.
గురువారం నాడు మీరు జుట్టు కత్తిరించుకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి బుధవారం నాడు మీరు ఇలాంటి పనులు చేయాలంటే చేసుకోవచ్చు. దీని వల్ల ఎటువంటి నష్టము ఉండదు పైగా ఆర్ధిక సమస్యలు వంటివి కూడా రావు.