ఎన్ని ఏళ్ళైనా వ్యాక్సిన్ పని చేస్తుంది.. బూస్టర్ డోస్ వలన యాంటీబాడీస్ పెరుగుతాయి…!

-

కరోనా సెకండ్ వేవ్ కి మరియు వ్యాక్సినేషన్ కి మధ్య చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రపంచమంతా కూడా వ్యాక్సిన్ ఎంత వరకు ఉంటుంది, ఎన్ని ఏళ్ళు పని చేస్తుంది అని అంటున్నారు. సైంటిస్టులు ఏడు రకాల కరోనా వ్యాక్సిన్స్ మీద క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు, అయితే వీటి ద్వారా ఎంత వరకు వాక్సింగ్ వల్ల ఇమ్యూనిటీ వస్తోంది అనేది తెలుసుకుంటున్నారు. వాటి ద్వారా వీటిని వెల్లడించారు.

వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత న్యూట్రలైజ్ యాంటీబాడీస్ తగ్గిపోతాయి. అటువంటి సమయంలో బూస్టర్ డోస్ తీసుకుంటే తిరిగి మళ్ళీ పెరుగుతాయి. తద్వారా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండటానికి సహాయపడుతుంది.

అదే విధంగా బూస్టర్ డోస్ తీసుకోక పోయినా కూడా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. చాలా సంవత్సరాల వరకు కూడా తీవ్రమైన సమస్య ఉండదు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు. కానీ తక్కువగా ఇన్ఫెక్ట్ అవుతారు. అలానే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తక్కువ న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ వున్నా కూడా కరోనాని సోకకుండా ఉండడానికి చూస్తాయి. ఒకవేళ కరోనా వచ్చినా కాపాడడానికి సహాయం చేస్తాయి

యూనివర్సిటీ అఫ్ సిడ్నీ మైక్రోబిలోజిస్ట్ James Tricus pfizer , moderna వ్యాక్సిన్స్ ఎక్కువ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయని.. ఆస్ట్రాజెనికా తక్కువ యాంటీ బాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తోంది అని అయితే ఏమి అయినా కూడా సంవత్సరం తర్వాత తగ్గిపోతాయి అని అన్నారు.

ఆ తరువాత కొత్త బూస్టర్ డోస్ వేసుకోవడం వల్ల తిరిగి పెరుగుతాయని అన్నారు. క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా డేటాని చేయడం రీసెర్చర్లు కి పెద్ద కష్టం కాదు. ఏది ఏమైనా లోతైన డేటాని కలెక్ట్ చేయాలి అని రెసెర్చర్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version