ఇమ్యూనిటీ లేని వారు ఫైజర్ టీకా వేసుకోవచ్చా..? రెండవ టీకా వేసుకున్న తర్వాత..?!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి జరుగుతోంది. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే టీకా వేసుకున్న తర్వాత కూడా కరోనా బాధితులు మరణిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చికాగోకు చెందిన 75 ఏళ్ల వ్యక్తి కరోనా టీకా వేసుకుని మరణించినట్లు తెలిపారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వ్యక్తి జనవరిలో కరోనా బారిన పడి ఫైజర్ టీకా మొదటి డోసును వేసుకున్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రెండవ డోసు వేసుకున్నాడు. అయితే రెండవ డోసు వేసుకున్న తర్వాత తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌లో విందుకు వెళ్లినట్లు చెప్పారు. అయితే వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఫైజర్ టీకా
ఫైజర్ టీకా

విందులో పాల్గొన్న ఆ వ్యక్తికి ఆకస్మాత్తుగా జ్వరం రావడం ప్రారంభమైంది. దీంతో వారు వైద్యుడిని సంప్రదించారు. అప్పుడు వైద్యులు అతడి ఊపరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెంది ఉంది. కొద్ది రోజులపాటు ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారన్నారు. ఇంటికి తీసుకొచ్చిన కొద్ది రోజుల్లో అతడి పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్నారు. దీంతో ఆయన మార్చి 29వ తేదీన మరణించారన్నరు.

ఈ విషయంపై వైద్యులు ఈ విధంగా స్పందించారు. మరణించిన వ్యక్తి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా వస్తుంది. అలాగే కరోనా వల్ల అతడిలో న్యుమోనియా వ్యాప్తి చెందింది. దీంతో టీకా వేసుకున్న కూడా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు తగిన స్థాయిలో యాంటీబాడీస్ అభివృద్ధి కాలేదన్నారు. అయితే ఇది అందరిలో జరగదని, ఇమ్యూనిటీ పవర్ ఉండే వారు త్వరగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.

శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే వ్యక్తి టీకా వేసుకోవచ్చు. రుమటాయిడ్, ఆర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధులతో బాధపడే వారు మొదటగా వైద్యులను సంప్రదించి టీకా వేసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సీడీసీ ప్రకారం.. ఫైజర్, మోడెర్నా టీకాలు రోగనిరోధక శక్తి లేని వారికి కూడా సురక్షితం. ఎందుకంటే ఫైజర్, మోడెర్నా టీకాలు రెండూ సార్స్-కోవ్-2‌ ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. ఇది కరోనా వైరస్‌తో పోరాడి శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిని పెంపొందిస్తుంది.

ఫైజర్, మోడెర్నా టీకాలు స్పైక్ ప్రోటీన్‌లో రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రోటీన్ మానవ శరీరంలో ప్రవేశించి కరోనా వైరస్ కణాలను నియంత్రిస్తుంది. వ్యాక్సిన్ వేసినప్పుడు స్పైక్ ప్రోటీన్ వల్ల సురక్షితంగా ఉండగలం. కరోనా వైరస్‌తో పోరాడేందుకు మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు టీకా ఎలాంటి దుష్ప్రభావాలు చూపదు. శరీరంలో కరోనా వైరస్‌ను నియంత్రించి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు కనీసం 2 వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ కలవకుండా.. ఇంట్లోనే ఉండాలి. మాస్కులు ధరించి.. సామాజిక దూరం పాటించాలి.