తెలంగాణా నుంచి ఏపీలో అడుగు పెట్టాలంటే…!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చర్యలు అమలు చేస్తుంది. ఈ నేపధ్యంలో నేటి నుంచి ఈ నెల 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం12 గంటల‌ వరకే వ్యాపారాలు, రవాణాకు అనుమతి ఉంటుంది. 12 తర్వాత అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని ప్రభుత్వం సూచనలు చేసింది.

అత్యవసర సర్వీసులకు మాత్రమే 12 తర్వాత అనుమతి ఉంటుంది. జగ్గయ్యపేట చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తారు. దీనితో సరైన కారణం ఉంటేనే రాష్ట్రం లోకి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేసారు. లేదంటే వెనక్కి పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. నేటి నుంచి మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నారు. అంతరాష్త్ర, రాష్ట్రంలోపల సరుకుల రవాణా చేసే వాహనాలకు మినహయింపు ఉంటుంది. అంతర్రాష్ట్ర, జిల్లాల మధ్య ప్రయాణలకు కర్ఫ్యూ సమయంలో అనుమతి ఉంటుంది.