కరోనా వైరస్ రాకుండా ఉండడానికి కరోనా వ్యాక్సిన్ చాలా దేశాల్లో వేయించుకుంటున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది గర్భిణీలకు ఒక ప్రశ్న ఉంది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఏమైనా ప్రమాదం ఉందా అనేది తెలియడం లేదు.
మరి దీని కోసం ఇప్పుడు మనం చూద్దాం.. ప్రెగ్నెన్సీ సమయం లో మొదటగా అంబిలికల్ కార్డ్ డెవలప్ అవుతుంది. ఆ తరువాత ఎంబ్రియో డెవలప్ అయిన తర్వాత హార్మోన్ మరియు ఇమ్మ్యూనిటి సిస్టం అంబిలికల్ కార్డ్ సహాయ పడుతుంది.
ప్లాసెంటా మరియు ఫీటస్ లో కరోనా వ్యాక్సిన్ ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదు. అయితే కరోనా వ్యాక్సిన్ గర్భిణీలు వేయించుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఫీటస్ ని డ్యామేజ్ చేస్తుందని అన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదు అని నిపుణులు చెప్పడం జరిగింది.
కాబట్టి గర్భిణీలు కరోనా వ్యాక్సిన్ వేయించుకో వచ్చు. దీని వల్ల ఎటువంటి నష్టాలు ఉండవని నిపుణులు అంటున్నారు. ప్లాసెంటా లో కానీ ఫీటస్ లో కానీ ఎటువంటి నెగిటివ్ ప్రభావం రాదని ఇది పూర్తిగా సురక్షితం అని చెప్పడం జరిగింది. కనుక గర్భిణీలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.