కరోనా బారిన పడ్డ పిల్లలు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!

-

కరోనా మహమ్మారి వల్ల చాలా మంది చిన్నారులు కూడా సతమతమవుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. కరోనా బారిన పడకుండా చూసుకోవాలి. ఒకవేళ కరోనా వచ్చిందంటే అప్పుడు తప్పని సరిగా వీటిని పాటించాలి.

పెద్దలు కూడా పిల్లల సంరక్షణ పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అయితే ఈ రోజు ఆరోగ్యనిపుణులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకోవడం జరిగింది. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే కరోనా వచ్చిన చిన్నారులు వలన సమస్యలు వుండవు. ఒమీక్రాన్ ఇప్పుడు అందర్నీ భయపెడుతుంది. ఒమీక్రాన్ బారినపడ్డ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పిల్లలు వైరస్ బారిన పడి ఉంటే కచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి.

కరోనా బారిన పడ్డ పిల్లల్లో ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి:

కరోనా బారిన పడ్డ పిల్లల్ని వెంటిలేషన్ ఉండే రూమ్ లో ఉంచండి. అలానే ఎటాచ్ టాయిలెట్ ఉండేట్టు చూసుకోండి.
డాక్టర్ ని కన్సల్ట్ చేసి మందుల్ని ఇవ్వండి.
అలానే ఈ పిల్లల్ని గర్భిణీలకు దూరంగా ఉంచండి.
అలానే పెద్ద వాళ్ళకి కూడా దూరంగా ఉంచండి.
బాగా కేర్ తీసుకునే వాళ్ళని వీళ్ళ దగ్గర ఉంచండి.
హైడ్రేట్ గా ఉండేటట్లు చూసుకోండి.
తల్లి పాలు తాగే పిల్లలకు తల్లిపాలు ఇవ్వచ్చు. కాకపోతే కాస్త జాగ్రత్తగా మాస్క్ వేసుకోవడం లాంటి నియమాల్ని పాటించాలి.
అదే విధంగా పిల్లల్ని బయటికి వెళ్లకుండా చూసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వండి.
ఇమ్యూనిటీని పెంచేలా చూడండి.
అలానే ఆ పిల్లలు తిన్న ప్లేట్స్ వంటి వాటిని దూరంగా ఉంచండి.

Read more RELATED
Recommended to you

Latest news