తెలంగాణలో 11 ఉచిత కరోనా టెస్టింగ్ సెంటర్స్..! వివరాలు ఇవే…..

-

cm kcr starts 11  free corona testing centers in hyderabad
cm kcr starts 11 free corona testing centers in hyderabad

తెలంగాణలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపద్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈక్రమంలో హైదరబాద్ లో 11 కరోనా పరీక్షా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఉచితంగా కరోనా పరీక్షలు చేయించుకోవచ్చు. ఎవ్వరికీ ఎప్పుడు ఎటువంటి అస్వస్థ గురైనా కరోనా లక్షణాలు కనిపించినా వారు ఆ కేంద్రాలకు వెళ్ళి ఉచితంగా టెస్ట్ చేయించుకునేందుకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.

ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలివే:

  1. కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్

2.నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి

3.ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్

4.అమీర్ పేటలోని నేచుర్ క్యూర్ ఆసుపత్రి

5.మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్

6.ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్

7.రామంతపూర్‌లోని హోమియోపతి హాస్పిటల్

8.చార్మినార్‌లోని నిజామియా టిబ్బి హాస్పిటల్

9.కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి

10.వనస్థలి పురంలోని ఏరియా ఆసుపత్రి

11.నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్‌

Read more RELATED
Recommended to you

Latest news