
మన దేశ సంరక్షులు వారు మనని ఆపద నుండి కాపాడే బాధ్యత వారిది కానీ వారికే ఆపద వస్తే..? వారే కలవరానికి గురవుతే..? అవునండీ మన దేశ జవాన్లు బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లలోని సిబ్బందికి ఆపద వచ్చింది. సీఆర్‌పీఎఫ్ బీఎస్‌ఎఫ్ లోని సిబ్బందిని కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఏకంగా రెండు వేల మందికి పైగా జవాన్లు కరోనా బారిన పడ్డారు. సీఆర్‌పీఎఫ్‌లో 1,219 మంది, బీఎస్ఎఫ్‌లో 1,018 మందికి కరోనా సోకినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వారికి సరైన చికిత్స సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. భారత్ లో కరోనా దూకుడు తారాస్థాయికి చేరిపోయింది. దాదాపుగా 6 లక్షల కేసులకు చేరువలో ఉంది. కాగా 17400 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.