భారత్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజూ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 64 వేల మందికి పైగా గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు. 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇరవై నాలుగున్నర లక్షలు దాటాయి.
ఇక తాజాగా నమోదయిన కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య చూస్తే 24,61,191కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో 1007 మంది చనిపోగా ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 48,040కు చేరింది. ఇక దేశంలో 6,61,595 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలానే ఇప్పటి వరకు కరోనా నుంచి 17,51,556 మంది కోలుకుని బయటపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు మూడు కోట్లకు చేరువయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 2,76,94,416 పరీక్షలు చేసామని కేంద్రం పేర్కొంది.