సాయం సంతోషమే కానీ… జాగ్రత్త సుమా!  

-

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్న సమయంలో.. ప్రజలంతా ఇంటికే పరిమితమైన తరుణంలో.. రోజువారీ కూటికి ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలకు చేయూతగా కొందరు దాతలు వారి వారి దాతృత్వం చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నదానాలు, నిత్యవసర సరుకుల, శానిటైజర్లు, మాస్కుల పంపిణీ చేస్తున్నారు. అయితే… ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నావారు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆయన చేస్తున్న పని ఎంతో గొప్పది అన్న విషయం కరోనాకి తెలియక పోవడం ఆ వ్యక్తి దురదృష్టం! సికింద్రాబాద్ లోని నేరేడ్ మెట్ తాలూకా మధురా నగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో… అతని కుటుంబంతో పాటు స్థానికులు అందరినీ ఆస్పత్రికి తరలించారు! అయితే ఈ క్రమంలో అతనికి కాంటాక్ట్ అయిన సుమారు 40 మందికి ఇప్పుడు కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారనే విషయం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది! ఇంతకూ దీనికి కారణం అయిన సంఘటన ఏమిటో తెలుసా?… సదరు వ్యక్తి రెండు రోజుల క్రితం నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు అన్నదానం చేయడం! ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మరో 40 నుంచి 50మంది పాల్గొనడం!

నిజమే కదా… ఇలాంటి సమయాల్లో ఎంతో దాతృత్వంతో ముందుకు వస్తున్న ఇలాంటి వ్యక్తులకు కరోనా రావడం దారుణమే కదా… అనిపించక మానదు ఈ వార్త వింటే! అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ.. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, సాయం చేయడం చాలా అవసరం అన్న విషయం అంతా గుర్తించాలి. అయితే… ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇకపై ఎవరైన ఇలా అన్నదానాలు, నిత్వాసర సరుకుల పంపిణీలు చేస్తుంటే మాత్రం స్థానిక వాలంటీర్ల పర్మిషన్ తీసుకోవడంతోపాటు.. స్థానిక కరోనా కంట్రోల్ రూం కి కూడా సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఆ సమాచారం వల్ల.. ఇలా అధిక సంఖ్యలో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటారట!

అధికారులకు తెలిస్తే ఎలాగూ చర్యలు తీసుకుంటారు కానీ… అంతకంటే ముందుగానే ఇలా సహాయ కార్యక్రమాలు చేసేవారు కూడా ఎవరికి వారే భౌతిక దూరం పాటించాలని సూచిస్తుంది మనలోకం.కాం! ఎందుకంటే… అయితే… మనసున్న మంచిమనుషులకు ఇబ్బంది కలిగించకూడదు అని తెలియడానికి.. “ఈ లేటెస్ట్ శత్రువుకి రూపమే లేదు కదా ఇంక మనసు మాత్రం ఎలా ఉంటుంది” చెప్పండి!! సో.. మన జాగ్రత్తలో మనం ఉండాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version