కరోనా సమయంలో బేకరీ ఫుడ్ మంచిదేనా…?

-

ఈ రోజుల్లో అందరు ఇంట్లో వండుకోకుండా రెస్టారెంట్లకు వెళ్లి తినడం బాగా అలవాటు పడిపోయారు. కాని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అన్ని చోట్లా లాక్ డౌన్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో బయటికి వెళ్లి వచ్చిన వారిని సానిటైజర్స్ తో క్లీన్ చేసుకున్న తరువాతే ఇంట్లోకి వెళ్ళ మంటున్నారు. మరి ఈ పరిస్థితిల్లో బయట ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చా అనే సందేహాలు వ్యక్త మౌతున్నాయి. అయితే నిపుణులు దీనికి స్పందిస్తూ బయటి ఆహారం మంచిదే కాని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

ఆహారం ద్వారా కరోనా వ్యాపించడం చాలా తక్కువ. వైరస్ సోకినా వ్యక్తి నుండి వచ్చే దగ్గు, తుమ్ముల వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అందువల్ల హోం డెలివరీ ఫుడ్ వల్ల కరోనా సోకే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు చెపుతున్నారు. అన్నిటి కన్నా ఇంట్లో వండుకుని తింటే ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఒక వేళ బయటి నుండి ఆహారాన్ని తెచ్చుకుంటే మాత్రం ముందుగా ఆ ఫుడ్ ని ఇంట్లో ఒక మూల ఉంచి సబ్బుతో చేతులు కడిగిన తరువాత ఆ ఫుడ్ బయటకు తీసి వేరే గిన్నెలో పెట్టాలి.

తరువాత ఆ ఫుడ్ అట్టలు, కవర్లు అన్నిటిని బయట ఎండ తగిలే చోటులో డస్ట్ బిన్ లో వేయాలి. తరువాత మళ్ళి ఇరవై సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడగాలి. ఇప్పుడు ఆ ఆహారాన్ని వేడి చేసి తినాలి. వేడి ఆహారం తినడం వల్ల ఎలాంటి వైరస్ లు దరిచేరవు. చైనా లాంటి దేశాల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ తమ ఉష్ణోగ్రత కార్డులపై చూపిస్తున్నారు. ఇండియా లో కూడా కరోనా  తగ్గక పోతే ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version