భయంతో హాస్పిటల్ లో ఉరేసుకున్న కరోనా పేషెంట్

-

కరోనా పాజిటివ్ పేషెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో జరగడంతో మిగతా పేషెంట్స్ లో టెన్షన్ పట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే మరియమ్మ అనే మహిళకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈమెకు ప్రస్తుతం 65 సంవత్సరాలు. ఈమె చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి అక్కడే వైద్య సేవలు పొందుతుంది.

అయితే తనకు కరోనా వచ్చిన విషయం తమ గ్రామస్తులకు తెలిస్తే అవమానిస్తారని ఆమె భావించిందని అంటున్నారు. అంతే కాక శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, వైద్యులు చేసే చికిత్స వల్ల రోగం నయం అవుతుందో లేదో అని తీవ్ర ఆందోళన చెంది నిన్న రాత్రి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ముదిగొండమండలం బుద్ధారంకు చెందిన ఈ మహిళ ప్రభుత్వాసుపత్రిలోనే ఉరేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కరోనా వచ్చినా తగ్గుతుందని ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా చాలా మంది టెన్షన్ తో చనిపోతున్నారు. మరికొందరు ఎవరైనా అవమానిస్తారేమో అనే భయంతో ఇలా సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news