కరోనాసోమ్నియా: కరోనా కారణంగా వచ్చే నిద్రలేమి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

-

మహమ్మారి కారణంగా నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మహమ్మారి తీసుకువచ్చిన పరిస్థితుల వల్ల ఇలా అవుతుండడం చేత దీన్నికరోనాసోమ్నియా అంటున్నారు. కరోనా కారణంగా నిద్రలేకపోవడానికి గల కారణాలను చూస్తే,

ఒత్తిడి

కరోనా సోకుతుందేమో అన్న భయం, నా వల్ల ఇతరులకు అంటుకుంటుందేమో అని అనుమానం, కరోనా వార్తలు ఎక్కువగా చూడడం, ఎవరూ సాయం చేయకపోవడం, కోవిడ్ వచ్చిన కుటుంబ సభ్యులతో దూరం ఉండాల్సి రావడం మొదలగు కారణాలు తీవ్ర ఒత్తిడికి గురి చేసి నిద్రలేమికి దారి తీస్తున్నాయి.

దినచర్య మారిపోవడం

శరీరానికి పని లేకపోవడం, ఆన్ లైన్ పనులు, కనీసం విరామం లేకుండా పనిచేయడాలు, ఇంట్లోనే ఉండడం, కొన్ని కొన్ని సార్లు పగటి పూట ఎక్కువ పడుకోవడం వలన కూడా నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి.

ఆర్థికపరమైన ఇబ్బందులు

ఉద్యోగం కోల్పోవడం, తక్కువ సంపాదన, కెరీర్ ఏమవుతుందోనన్న భయం, ఖర్చులు పెరగడం మొదలగు వాటివల్ల నిద్ర దూరం అవుతుంది.

ఇవే కాదు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం, యాంగ్జాయిటీ, ఒళ్ళునొప్పులు, ఒత్తిడి, చనిపోతామనే భయం మొదలగునవన్నీ కలిసి మెదడు మీద ప్రభావం చూపి, నిద్రని దూరం చేస్తున్నాయి.

ఇంకా, సెల్ఫ్ ఐసోలేషన్ కూడా నిద్రలేమికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఎవ్వరూ కలవకపోవడం అనేది మనసు మీద బాగా ప్రభావం పడుతుంది.

మరి దీన్ని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి?

ముందుగా నెగెటివ్ వార్తలకి దూరంగా ఉండాలి. ఆన్ లైన్ లో వచ్చే ప్రతీ అప్డేట్ ని పట్టించుకోకూడదు. రికవరీ అవుతున్న విధానానం మీద దృష్టి సారించాలి. మధ్యాహ్నం పూట ఎక్కువ సేపు పడుకోకుండా ఉండాలి. ఇంకా కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ మొదలగు వాటి ముందు ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version