కరోనాకి మందు వచ్చింది… కోతులపై సక్సెస్!

-

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా… కరోనా వైరస్ కు మందు కనుక్కోవడంలోనే తలమునకలయ్యారు. ఈ విషయంలో అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అనే తారతమ్యాలు లేవు. అయితే… ఏ దేశం వల్ల ఈ కరోనా వైరస్ పుట్టిందో.. ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందిందో ఆ దేశమే ఒక వ్యాక్సిని కనుగొంది! అవును… ప్రస్తుతం చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కి వ్యాక్సిన్ కనుగొందట చైనా!

అవును… కరోనా వ్యాక్సిన్‌ తయారీకి చైనా నిర్వహించిన తొలి దశ ప్రయోగ పరీక్షలకు సంబంధించిన ఒక కీలక సమాచారాన్ని “బయో ఆర్కైవ్‌” అనే వెబ్ సైట్ ఒక అధ్యయన నివేదిక ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం… చైనా శాస్త్రవేత్తలు ఇప్పటికే కఓనా వైరస్ కు వ్యాక్సిన్ ని కనుగొన్నారని, కాకపోతే ముందుగా మనుష్యులపై ప్రయోగించలేరు కాబట్టి… తొలుత ఎలుకలు, కోతులపై వ్యాక్సిన్‌ ను ప్రయోగించారని చెబుతున్నారు. అందులో భాగంగా ముందుగా కోతులకు 3 మైక్రోగ్రాములు, 6 మైక్రోగ్రాములు కలిగిన రెండు రకాల డోసుల వ్యాక్సిన్‌ ను ఇచ్చరంట. దాంతో వాటిలో కొన్ని ఇన్ఫెక్షన్‌ నుంచి పూర్తి రక్షణ పొందగా.., ఇంకొన్ని పాక్షిక ఉపశమనం పొందాయంట.

ఈ వ్యాక్సిన్ ను బాడీలోకి ఎక్కించగానే దీంతో కరోనా వైరస్ ను తిప్పికొట్టేందుకు ఆ కోతుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్పందించి యాంటీ బాడీస్ ను ఉత్పత్తి చేస్తుందట. దీంతో ప్రస్తుతం వారు కనుగొన్న వ్యాక్సిన్ పనితీరు బాగా ఉందనే నిర్ధారణకు వచ్చారంట చైనా శాస్త్రవేత్తలు! ఇదే నిజమైతే… చైనా ఏ ధరకు ఆ ఫార్ములా అమ్ముతాది లేదా ఏ ధరకు ఆ వ్యాక్సిన్ ను అందిస్తాది అనే విషయాలు కాసేపు పక్కన పెడితే… ఈ వార్త మాత్రం అన్ని దేశాలకు శుభవార్తే!

Read more RELATED
Recommended to you

Latest news