రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ నగరంలో పురుడుపోసుకున్న ఈ మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. అన్ని దేశాలపై దండయాత్ర చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్లగా తన రూపాన్ని మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తోంది. తాగాగా మరో కొత్త వేరియంట్ బ్రిటన్ లో పుట్టుకొచ్చింది. ఎక్స్ ఈ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బయటపడింది. ఓమిక్రాన్ కన్నా పదిరెట్ల వేగంతో వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ నటుడు, జెమ్స్ బాండ్ చిత్రాల్లో హీరోగా నటించిన డెనియల్ క్రెయిగ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. క్రెయిగ్ ఓ స్టేజ్ షోలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉండగా… ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ ప్రదర్శనను రద్దు చేశారు. 2021లో వచ్చిన ‘ నో టైం టూ డై’ సినిమాలో బ్రిటిష్ గూడాఛారిగా నటించారు.