కరోనా సెకండ్ వేవ్ వీరవిహారం చేస్తున్న ప్రస్తుత సమయంలో ఆస్పత్రుల చేష్టలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రులు ఇన్స్యూరెన్స్ ఇవ్వకపోవడం ఆందోళనకి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల పనితీరుపై ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో తెలియట్లేదా? ఐతే ఇది చూడండి.
నగరు రహిత వైద్యం అందించకుండా, అర్హత ఉన్నా ఇన్స్యూరెన్స్ అందించకపోయినా ఫిర్యాదు చేయవద్దు. దానికోసం అంబుడ్స్ మెన్ కి, ఇన్స్యూరెన్స్ కంపెనీకి కంప్లైట్ ఇవ్వాలి. మీరు కంప్లైంట్ ఇచ్చిన 15రోజుల లోపల ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎలాంటి చర్య తీసుకోనట్లయితే ఇన్స్యూరెన్స్ కంపెనీలని రెగ్యులేట్ చేసే భారతీయ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీకి కంప్లైంట్ చేయాలి.
కంప్లైంట్ చేయడానికి ఐఆర్‌డిఎ వెబ్ సైట్ నుండి (http://www.policyholder.gov.in/Report.aspx) ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో పాలసీదారుడి పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు రకాలుగా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
కంప్లైంట్ ఇవ్వడానికి మరిన్ని మార్గాలు
ఐఆర్‌డిఎ వినియోగదారుల పరిష్కార విభాగానికి చెందిన టోల్ ఫ్రీ నంబర్ 155255 లేదా 1800 4254 732 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఇంకా, కావాల్సిన అన్ని పత్రాలను దగ్గర పెట్టుకుని igms.irda.gov.in ద్వారా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
కంప్లైంట్ ఇచ్చిన తర్వాత IRDA నుండి రిఫరెన్స్ తీసుకోవాలి.
ఇది గాక ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి, కంప్లైంట్లు ఇవ్వడానికి మనదేశంలో సరైన వ్యవస్థ లేదు. అంబుడ్స్ మెన్ కి మన ఫిర్యాదుని పంపిస్తే వారు ప్రభుత్వానికి పంపిస్తారు. అప్పుడు ప్రభుత్వమే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ప్రభుత్వమే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి.
మీకుగానీ, మీకు తెలిసిన వాళ్ళకి గానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ఎంతమాత్రం సహించకండి. మహమ్మారి సమయంలో ప్రాణాలను పీక్కుతినేవాళ్ళు మహమ్మారి కంటే ప్రమాదకరం.