వర్క్ ఫ్రం హోం చేస్తే ఇవి మర్చిపోవద్దు…!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో అన్ని ఐటి కంపెనీలు కూడా ఇప్పుడు వర్క్ ఫ్రొం హోం ని ప్రకటిస్తున్నాయి. దాదాపు అన్ని ఐటి కంపెనీలు కూడా దీనిని అమలు చేస్తున్నాయి. తమ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని భావించిన కంపెనీలు ఇప్పుడు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మన ఇండియాలో కూడా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రొం హోం ని ప్రకటించాయి.

వర్క్ ఫ్రొం హోం విషయంలో చాలా మంది అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు. దీనితో కంపెనీలు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వర్క్ ఫ్రొం హోం చేసే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఆ జాగ్రత్తలు ఏంటీ…?

వర్క్ అసలు వాయిదా వేసుకోవద్దు… టైం కచ్చితంగా పాటించాలి. ఆఫీస్ లో ఉన్నట్టు ఫీల్ వర్క్ పూర్తి చేసేసుకుని, ఫుడ్ కూడా టైం కి తీసుకుని… జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. వర్క్ ఎట్ హోమ్ కదా అని డ్రెస్ కోడ్ లేకుండా ఉంటే వర్క్ చేయలేరు. ఇది పరిశోధనలో కూడా తెలిసింది. కాబట్టి వర్క్ ఫ్రొం హోం చేసే వాళ్ళు మంచి డ్రెస్ వేసుకోండి.

ఇల్లునే ఆఫీస్ గా ఏర్పాటు చేసుకుని, అక్కడ వర్క్ మాత్రమే చేసుకోండి. ఇంట్లో ఉన్నాం కదా అని టీవీ ఎక్కువగా చూస్తారు. అది అసలు మంచిది కాదు. ఆఫీస్ సెట్ చేసుకున్నప్పుడు కూర్చునే విధానం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు ఇంట్లో ఉండి ఆర్టికల్స్ రాసే వాళ్ళు అయితే ఈ టైం కి ఇన్ని కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుని పని చెయ్యాలి. వర్క్ అసలు వాయిదా వేసుకోవద్దు. వేసుకుంటే భారం మినహా మరొకటి ఉండదు.

కీ బోర్డు సహా అన్ని పరికరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెట్ సరిగా ఉండాలి లేకపోతే పని వాయిదా పడిపోతుంది. ఇక కూర్చునే విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం మీరు ఇబ్బంది పడటం ఖాయ. దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. మీ పరికరాలు ఎవరూ పట్టుకోకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news