కోవిడ్ 19 ఎలా అల్లకల్లోలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా ను ఎదర్కోవాలి అంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఈ నేపథ్యంలోనే దేశంలో అధికంగా కరోనా వైరస్ కేసులు ఉన్న ఢిల్లీలో సిటీ బస్సులో ఇ-టికెట్లను ఇవ్వాలని ఆల్సోచిస్తున్నారు.
కరోనా వైరస్ పేపర్ ద్వారా వ్యాపించే అవకాశం ఉండడం వల్ల ప్రయాణికులకు రైల్వేలో, ఎయిర్ లైన్స్ లో లనే డిజిటిల్ చెల్లింపుల ద్వారా ఇ-టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటి) ఈ టెక్నాలజీని తీసుకొస్తుంది.
కాగా ఐఐఐటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవేష్ బియానీ ఈ విషయం మాట్లాడుతూ.. పేపర్ టికెట్ ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని అందుకే ప్రయాణికులకు ఎపిఐ క్యూఆర్ కోడ్ ఆధారంగా ప్రయాణాలకు సంబంధించిన టికెట్లు తీసుకోవాలని ఇంకా వీటికి డిజిటల్ ద్వారానే చెల్లించాలి అని అయన చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి ట్రయల్స్ క్లస్టర్స్ లో విజయవంతంగా జరిగినట్టు, త్వరలోనే ఢిల్లీ సిటీ బస్సులోను నిర్వహిస్తున్నట్టు ప్రవేష్ బియానీ తెలిపారు.