కరోనా కంటే భయమే ప్రమాదం…!

-

ప్రపంచానికి ఇప్పుడు కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది అనే మాట నిజం. దాదాపు 90 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. అన్ని దేశాలు కూడా దీని విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడిక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని విమానాశ్రయాల్లో పరిక్షలు చేస్తూ ఇలా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మన దేశానికి కరోనా సునామి రావడం తో ప్రజల్లో భయం మొదలయింది.

ఇప్పుడు ఆ భయం నిజంగా మనుషుల ప్రాణాలు తీస్తుంది. జలుబు దగ్గు అనేది చలి కాలం రావడం సహజం. కాస్త జలుబు దగ్గు వస్తే చాలు కరోనా అనుమానితులు అంటూ పరిక్షలు చేయించుకోవడం, కరోనా పరిక్షలు చేయించుకుంటున్న వారిని కూడా మీడియా రోగులుగా చూపిస్తూ అన్ని విధాలుగా చుక్కలు చూపిస్తుంది. ప్రజలు కూడా ఈ వ్యాధి దెబ్బకు ఏ ప్రచారం వచ్చినా సరే నమ్ముతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి రాలేదు.

కాని ఆంధ్రప్రదేశ్ లో జలుబు దగ్గు వచ్చిన వారిని రోగులుగా చూపిస్తున్నారు. మీడియా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇప్పటికే భయపడుతున్నారు. ఆ భయాన్ని మీరు ఎందుకు పెంచుతున్నారు అంటూ పలువురు మీడియా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క ఏడిస్తేనే శకునం అని కంగారు పడి రాత్రి అంతా నిద్రపోకుండా కంగారు కంగారు గా బతుకుతారు జనం. అలాంటి వాళ్ళను ఈ విధంగా బస్సుల్లో, కారుల్లో కరోనా అని తప్పుడు ప్రచారం చేసి భయపెట్టడం ఎంత వరకు సమంజసం.

Read more RELATED
Recommended to you

Latest news