తెలంగాణా ప్రజలకు బిగ్గెస్ట్ గుడ్ న్యూస్

-

దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ని అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ ని పంపిణీ చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం వ్యాక్సిన్ ని ప్రజలకు అందించే కార్యక్రమాలను సిద్దం చేసింది. ఈ క్రమంలో తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటేల రాజేంద్ర కీలక ప్రకటన చేసారు.

నాలుగు రోజుల్లో రాష్ట్రానికీ వ్యాక్సిన్ రానుంది అని ఆయన పేర్కొన్నారు. రేపు అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కేంద్రం సమావేశం అవుతుంది. సమావేశం లో మంత్రి ఈటెల కూడా పాల్గొంటారు. కోవిషీల్ట్ వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న అధికారులు… ఏ వ్యాక్సిన్ వచ్చినా పంపిణీకి సర్వం సిద్ధం చేశాం అని చెప్తున్నారు. 2.60 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్స్ కి తొలిదశ వ్యాక్సిన్ అందిస్తారు.

5కోట్ల డోసులు భద్ర పరిచేలా ఫ్రీజర్ వ్యవస్థ ఏర్పాటుచేసామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 850 కోల్డ్ చైన్ పాయింట్స్ ఏర్పాటు చేసారు. 5 లక్షల మంది ఫ్రెంట్ లైన్ వర్కర్స్ తో పాటు 75 లక్షల మంది ప్రజలకు తొలివిడత అందిస్తారు. వృద్దులకు, ఇతరత్రా వ్యాధి గ్రస్తులను గుర్తింపు కోసం త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తారు. వ్యాక్సిన్ రియాక్షన్స్ పై సైతం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news