కోవిడ్‌ 19 రాకుండా చూసుకునేందుకు ఐసీఎంఆర్‌ చెప్పిన 25 ముఖ్యమైన సూచనలు..!

-

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎక్కడ చూసినా తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేయలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ నియంత్రణలో ఉన్నా.. చాలా వరకు రాష్ట్రాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంపై జనాలు తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) కోవిడ్‌ రాకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో.. దేశ ప్రజలకు పలు ముఖ్యమైన సూచనలు జారీ చేసింది. అవేమిటంటే..

icmr 25 important tips to prevent covid 19 spreading

1. ప్రజలెవరూ వచ్చే 2 ఏళ్ల వరకూ విదేశీ ప్రయాణాలు అస్సలు చేయరాదు.
2. ఏడాది వరకు కేవలం ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. బయటి ఆహారాలను తీసుకోకూడదు.
3. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకూడదు.
4. విహారయాత్రలకు వెళ్లడం మానుకోవాలి.
5. జనాలు ఎక్కువగా, గుంపులు గుంపులగా ఉన్న చోటకు వెళ్లకూడదు.
6. భౌతిక దూరం పాటించాలి. దగ్గు, తుమ్ములు వంటి శ్వాస సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
7. మాస్కులను తప్పనిసరిగా ధరించాలి.
8. వీలైనంత వరకు శాకాహారం తినేందుకే ప్రాధాన్యతను ఇవ్వండి.
9. మాల్స్‌, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు.
10. పార్కులు, పార్టీలకు దూరంగా ఉండాలి.
11. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.
12. సెలూన్లు, స్పాలకు వెళ్లకుండా ఉంటే మంచిది.
13. సభలు, సమావేశాలకు వెళ్లకూడదు.
14. కరోనా అంత త్వరగా తగ్గుముఖం పడుతుందని అనుకోవద్దు. దాంతో మనం ఎక్కువ కాలం పాటు జీవించాలని తెలుసుకోవాలి.
15. బయటకు వెళ్లినప్పుడు బెల్టు ధరించడం, ఉంగరాలు పెట్టుకోవడం, వాచీలు పెట్టుకోవడం మానేయాలి.
16. సమయం చూసుకోవాలంటే సెల్‌ఫోన్‌లో సదుపాయం ఉంటుంది.
17. కర్చీఫ్‌, క్లాత్‌ మాస్కులకు బదులుగా వీలైనంత వరకు మెడికల్‌ మాస్కులను, ఎన్‌95 మాస్కులను వాడితే మంచిది.
18. శానిటైజర్‌, టిష్యూ పేపర్లను దగ్గర ఉంచుకోవాలి.
19. చెప్పులు, షూస్‌ను వేసుకుని ఇంట్లో తిరగకూడదు. బయటే వదిలి లోపలికి వెళ్లాలి.
20. బయటి నుంచి వచ్చాక స్నానం చేయాలి. లేదా కనీసం ముఖం, కాళ్లు, చేతులను అయినా సరే శుభ్రంగా కడుక్కోవాలి.
21. అనుమానిత రోగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి వారి వద్ద ఉన్నామని తెలిశాక వెంటనే దూరం జరగాలి. తరువాత స్నానం చేయాలి.
22. లాక్‌డౌన్‌ విధించినా, లేకున్నా.. కనీసం మరో 6 నెలల పాటు అయినా సరే కరోనా పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిందే.
23. వచ్చే 2, 3 నెలల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలి.
24. బయటికి వెళ్లేటప్పుడు చేతులను హ్యాండ్‌ శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. తిరిగి వచ్చాక అదే పని చేయాలి.
25. కూరగాయలు, పండ్లు తెచ్చినప్పుడు వాటిని శుభ్రంగా కడిగాకే తినాలి.

Read more RELATED
Recommended to you

Latest news