ఓ తండ్రి తన కొడుకు పెళ్లి ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు. కానీ బయట కరోనా కలకలం… అయినా పర్లేదని నిబంధనలను ఉల్లంఘించి మరీ పెళ్లి జరిపించాడు. 50 కి మించి అతిధులు హాజరయ్యారు. మొత్తానికి పెళ్లి ఘనంగానే చేయగలిగాడు. కానీ విషాదం ఏంటంటే ఆ పెళ్ళికి కరోనా అనే బందువు కూడా వచ్చింది దీంతో 15 మంది కరోనా బారిన పడ్డారు అందులో ఒకరు మరణించారు. ఈ ఘటన రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని భిల్వారా జిల్లాలో గీసులాల అనే వ్యాపారి ఉన్నాడు తన కొడుకు పెళ్ళికి ముహూర్తం నిశ్చయించాడు కరోనా విలయతాండవం చేస్తున్నా పెళ్లి మాత్రం ఘనంగా చేశాడు..! పెళ్ళికి చాలా మంది చుట్టాలు వచ్చారు. కానీ అదే పెళ్ళికి పిలవని అతిధి కూడా వచ్చింది అదే కరోనా మహమ్మారి. దీంతో పెళ్ళికి హాజరయిన 15 మందికి కరోనా సోకింది ఒకరు మరణించారు. వారందరికి చికిత్స కు గాను టెస్టులకు అంబులెన్స్ ఛార్జీలు మందులకు కలిపి మొత్తం 6,26,000 ఖర్చు వచ్చింది. ఈ కేసు అక్కడి కలెక్టర్ దృష్టికి వెళ్లింది, యజమాని నియమాలను అతిక్రమించి అందరినీ కరోనా బారిన పాడెట్టు చేసినందుకు ఆ కలెక్టర్ అయిన ఖర్చు మొత్తాన్ని యజమాని పైనే మోపుతూ 6 లక్షల ఫైన్ విధించాడు. వచ్చిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి తరలించాడు.