బిగ్ బ్రేకింగ్: తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ పెంపు

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం ఉండటం లేదు. దీనితో నైట్ కర్ఫ్యూని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మే 8వ తేదీ ఉదయం 5గంటల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణా ప్రభుత్వం. తెలంగాణాలో కరోనా చర్యలకు సంబంధించి హైకోర్ట్ సీరియస్ గా ఉంది.

నైట్ కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు నిర్ణయం ప్రకటించడం లేదు అని హైకోర్ట్ మండిపడింది. ఇప్పుడు తెలంగాణాలో పరిస్థితి చేయి దాటక ముందే నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ సూచనలు చేస్తుంది. నేడు అధికారులతో సిఎస్ సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు.