కరోనా కేసులు పైపైకి.. కారణం అదే..!

గత ఏడాదిగా కరోనా కేసులతో బెంబేలెత్తుతూ 2–3 నెలల నుంచి తగ్గుముఖం పడుతుండటంతో కాస్త ఊరట కలుగుతోంది. ఇటీవల మళ్లీ కేసుల సంఖ్య పైపైకి వెళుతుంది. కరోనా నిబంధనలపై నిర్లక్ష్యం, ఇష్టానుసారంగా బయట తిరగడం చేస్తున్నారు. ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల తర్వాత కేసుల సంఖ్య మరీ పెరిగింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనే గుంపులు గుంపులుగా గుమిగూడి నృత్యాలు చేయడం, సరైన పరిశుభ్రత పాటించకపోవడం అందరు కలిసి ఒకేచోట, మరికొందరైతే ఒకే పాత్రలో భోజనం చేయడం లాంటి చేశారు. అందులో ఎవరికీ కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయే తెలియక కోరానా వ్యప్తికి కారణమైందని నిపుణులు అంటున్నారు.

 

తగ్గుతూ పెరుగుతూ..

జనవరి ఒకటిన తెలంగాణలో 293 కేసులు నమోదు కాగా, మరోసటి రోజు వంద కేసులు పెరిగాయి. మూడున 238 కి తగ్గి, 4, 5 తేదీల్లో మరో వంద పెరుగుతూ వచ్చాయి. ఈ పెరుగుదల కు న్యూ ఇయర్‌ వేడుకలే ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుభకార్యలలోనూ పరిమితికి మించి జనం వస్తున్నారు. ఏమాత్ర భౌతికదూరం పాటించకుండా సహాపంక్తి భోజనాలు చేయడంతోనూ కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయని.. దీనికి తోడు తీవ్రమైన చలి కూడా ఓ కారణమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో..

అయితే.. డిసెంబర్‌ చివరి వారం నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు రోగాల తాకిడి పెరిగింది. గతంలో కన్నా ఈ సారి ఆస్పత్రులో 30–35 మంది రోగులు పెరుగుతున్నట్లు సమాచారం. డిసెంబర్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పరిమితంగా ఉన్నా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పెరుగుతున్నారు. నూతన సంవత్సర వేడుకలు, తదితర కారణాలతో కేసుల సంఖ్య కాస్త పెరగింది. అయినా ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. మరో పదిహేను రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుంది. అంతకు వరకు ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు.