మూడు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవారు కోవిడ్ 19 నుండి చనిపోయే అవకాశం 93% తక్కువ..!

-

కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా మంది గతం లో కరోనా బారిన పడి చనిపోయారు. ఏది ఏమైనా ఇంకా కరోనా పూర్తిగా తగ్గిపోలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. కరోనా మహమ్మారి నుంచి మనం బయట పడడానికి వ్యాక్సిన్ బాగా సహాయ పడుతుంది. కరోనా బూస్టర్ డోస్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తోంది.

 

బూస్టర్ డోస్ తీసుకుంటే ఆసుపత్రిలో చేరకుండానే కోలుకోవచ్చు. అలాగే మరణాల రేటు కూడా తగ్గింది. యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ప్రకారం కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్న వాళ్ల లో 93 శాతం మంది చనిపోకుండా ఉంటున్నారని.. వ్యాక్సిన్ తీసుకొని వాళ్లతో పోల్చుకుంటే 93 శాతం వ్యాక్సిన్ తీసుకున్న వారి లో తక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.

అయితే ముందు వచ్చిన వేరే వేరియంట్ల కంటే కూడా ఈ వేరియంట్ లో లక్షణాలు మైల్డ్ గా ఉంటుంది. పైగా గతం లో అందించిన రెండు వ్యాక్సిన్ డోసులు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బూస్టర్ డోస్ తీసుకోవడం వల్ల ప్రొటెక్షన్ లభిస్తుంది. ఒమీక్రాన్ నుండి బూస్టర్ డోస్ తొంబై శాతం ప్రొటెక్షన్ ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news