తెలంగాణలో మరో రెండేళ్లలో ఎన్నికలు ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలు కూడా వస్తాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈలోపే టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా బలపడేందుకు బీజేపీ సమాయత్తం అవుతోంది. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇదిలా ఉంటే ఇతర పార్టీల్లోంచి వ్యక్తే నాయకులతో బలపడేలని చూస్తోంది.
తాజాగా బీజేపీ పార్టీ బలోపేతానికి మరో ముందడు పడనుంది. యువ తెలంగాణ పార్టీ బీజేపీలో వీలీనం కానుంది. ఈనెల 16న తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం కాబోతోంది. యువ తెలంగాణలోని ముఖ్య నాయకులు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, రాణి రుద్రమలు బీజేపీ పార్టీలో నాయకులుగా మారబోతున్నారు. రాణి రుద్రమకు తెలంగాణలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది.