కరోనా మహమ్మారితో భయాందోళనలకు గురవుతున్న ప్రజలకు పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కంపెనీ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్‌ను త్వరలో ప్రారంభిస్తున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో చాలా తక్కువ ధరకే కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను ఇతర మందుల తయారీని కూడా తాత్కాలికంగా నిలిపివేశామని ఆ సంస్థ తెలియజేసింది.
పూణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ మే నెలలో కరోనా వ్యాక్సిన్‌కు హ్యూమన్ ట్రయల్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అవి సక్సెస్ అయితే.. సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను కేవలం రూ.1వేయికే అందజేస్తామని తెలిపారు. అలాగే మొదటి దశలో నెలకు 10 మిలియన్ల డోసులను సిద్ధం చేస్తామన్నారు. తరువాత నెలకు 20 నుంచి 40 మిలియన్ల డోసులను తయారు చేస్తామన్నారు.
ఇక కరోనా వ్యాక్సిన్ తయారీకి గాను తాము ఇతర మెడిసిన్ల తయారీని తాత్కాలికంగా నిలిపివేశామని అదర్ పూనావాలా తెలిపారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ కోసం రూ.3వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఈ విషయంలో తమకు మద్దతు లభిస్తే తమపై పడే భారం కొంత వరకు తగ్గుతుందన్నారు. కాగా అటు యూకేలోనూ పలు సంస్థలు వచ్చే సెప్టెంబర్ వరకు కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించిన విషయం విదితమే. మరి ఈ వ్యాక్సిన్ రేసులో ఏ దేశం మొదటి స్థానంలో నిలుస్తుందో చూడాలి..!