తెలంగాణలో కరోనా రిపోర్టుల మీద హైకోర్టు ఆగ్రహం

-

తెలంగాణలో కరోనా మరణాల రిపోర్టుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల మీద హై కోర్టు కు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రభుత్వం కరోనా మృతులపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందన్న హైకోర్టు, కేసులు పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉందని పేర్కొంది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయి బులెటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని, ఆగస్టు 31 నుంచి ఈనెల 4 వరకు అన్ని జిల్లాల బులెటిన్లు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈనెల 22 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు విచారణ 24కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news