జేఈఈ, నీట్ పరీక్షలను 2020 వాయిదా వేయాలని కోరుతూ, అలాగే ఆగస్టు 17 న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 6 ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల కేబినెట్ మంత్రులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. బిజెపి పాలన లేని రాష్ట్రాల నుండి 6 మంది క్యాబినెట్ మంత్రులు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు. , పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ గడ్, జార్ఖండ్, మరియు మహారాష్ట్ర.
గత నెల 28న ఈ పిటీషన్ దాఖలు చేసారు. పశ్చిమ బెంగాల్ (మోలోయ్ ఘటక్), జార్ఖండ్ (రామేశ్వర్ ఒరాన్), రాజస్థాన్ (రఘు శర్మ), ఛత్తీస్‌గడ్ (అమర్‌జీత్ భగత్), పంజాబ్ (బిఎస్ సిద్దూ), మహారాష్ట్ర (ఉదయ్ రవీంద్ర సావంత్) మంత్రులు ఈ సమీక్ష పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆగస్టు 17 న, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) మరియు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) ను వాయిదా వేయాలని కోరిన పిటీషన్ ని కొట్టేసింది.