కరోనా వైరస్ వల్ల అనేక మంది పేదవాళ్ళు మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాల్లో మూతపడటంతో ఉద్యోగాలు లేకపోవటంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఏ రోజుకి ఆ రోజు బ్రతికే వాళ్ల కుటుంబాల పరిస్థితి ప్రస్తుతం చేయి చాచే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్న గాని అవి కొన్ని రోజులకే వస్తున్నాయి.ఇటువంటి టైములో సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగి ఒకపక్క ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూనే మరోపక్క పేదవాళ్లకు సహాయం చేస్తున్నారు. ఈ విధంగా తెలుగు సంగీత రంగంలో మంచి సింగర్ గా పేరొందిన స్మిత ఇతరులకు స్ఫూర్తిని కలిగించే విధంగా ధైర్యం పెంచుతూ దాదాపు 80 వేల మందికి పైగానే భోజనాలు పెట్టి తనలో ఉన్న సేవాభావాన్ని బయటపెట్టింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ‘సైబరాబాద్ సీపీ సజ్జనార్ సర్..మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
గత 30 రోజులుగా మీ బృందంతో కలిసి పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. మీ టీమ్ ద్వారా ఇప్పటి వరకూ 82360 మందికి భోజనం పెట్టాం. ఇప్పుడు మీ సూచన మేరకు నిత్యావసరాలను అందించే పని ప్రారంభిస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను’ అని స్మిత ట్వీట్ చేసింది. దీంతో స్మిత అభిమానులు ఆమె చేసిన పనికి సెల్యూట్ చేస్తున్నారు. మరోపక్క స్టార్ హీరోలు హీరోయిన్లు అని చెప్పబడే వాళ్ళు కూడా స్మిత మాదిరిగానే ఇతరులను ఆదుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పుకొచ్చారు.