ఒక్క రోజులో మూడు లక్షల కరోనా కేసులు…!

-

కరోనా వైరస్ మహమ్మారి అందర్నీ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా 2-3 లక్షల మధ్య కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా 3 లక్షల కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,14,835 మంది కరోనా వైరస్ బారినపడ్డారు.

 

అలానే నిన్న ఒక్క 2,104 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎంతో ప్రమాదకరంగా మారిపోయింది. ఒక్క రోజులో లక్షల కేసులు నుంచి 3 లక్షల కేసులు కూడా నమోదు అవుతున్నాయి. రోజుకి 6.7 శాతం రెట్లు కేసులు ఎక్కువైపోతున్నాయి.

అమెరికాతో పోల్చితే మూడు రెట్లు ఎక్కువ కేసులు ఇండియా లో వస్తున్నాయి. కానీ ఇండియా తో పోల్చుకుంటే అమెరికాలో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 14.41 కోట్ల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 30 లక్షల మంది కరోనా కారణంగా చనిపోయారు.

ఇప్పటి వరకు అమెరికాలో 97,881 మంది మరణించారు అంటే భారతదేశంతో చూసుకుంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా వున్నాయి. మన దేశంలో కూడా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర (4,027,827), కేరళ (1,197,301), కర్ణాటక (1,109,650), తమిళనాడు (962,935), ఆంధ్రప్రదేశ్ (942,135) రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version