హోలీ చేసుకోండి ..కానీ కరోనా ఉంది జాగ్రత్త ..!

హోలీ అనగానే అందరూ కలిసి చేసుకునే పండుగ, కుల మతాలతో సంబంధం లేకుండా ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళు అనే తేడా లేకుండా ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కాని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా హోలీ వద్దని అంటున్నాయి. ఆ పండుగకు దూరంగా ఉండాలని సూచిస్తున్నాయి.

అవును హోలీ ని అందరూ వద్దని అంటున్నారు. హోలీ పండుగ విషయంలో ఈ సారి ఎవరూ బాధపడకుండా కాస్త దూరంగా ఉంటే మంచి అంటున్నారు. కులాలను మతాలను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. హోలీ జరుపుకొండి… కాని ఒకరికి ఒకరు దూరంగా ఉండాలని అంటున్నారు. జనం ఎక్కువగా ఉన్న చోట హోలీ అస్సలు వద్దు. ఒకరికి ఒకరు రంగులు పూసుకోవడం, హగ్ చేసుకోవడం వద్దు.

దగ్గరకి తీసుకుని ముద్దులు పెట్టుకోవడం, నీళ్ళను వాడటం, కోడి గుడ్లు వాడకం తగ్గించాలి. చాలా మంది రంగులతో పాటు కోడి గుడ్లు కూడా విసురుతూ ఉంటారు. వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఇద్దరు ముగ్గురు కలిసి ఉండాలి. జనసమ్మర్ధ ప్రాంతాల్లో పండగ అస్సలు చేసుకోకుండా ఉండటమే మంచిది. రంగులు ఒకరికి ఒకరు పూసుకున్నా సరే మాస్కులు అనేవి అవసరం.

షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది అసలు వద్దు. హగ్ ఇస్తే సైగలతో ఇచ్చుకోండి. రాత్రి వేళల్లో అసలు హోలీ చేసుకోవద్దు. వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెంటనే చేతులు కడుక్కోవడం తో పాటుగా స్నానం వేడి నీళ్ళతో చేయడం అనేది చాలా అవసరం. చుట్టాలను ఇళ్ళకు పిలవకుండా ఉండటమే మంచిది. షాపింగ్ మాల్స్ కి కూడా వెళ్ళవద్దు. షాపింగ్ లు చెయ్యాలి, అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అనేవి ఆ రోజు మానేయండి. ఎండ బాగా ఉంటే బయటకు వెళ్ళండి.